Movies

అల్లు అరవింద్ ఎంత మంది హీరోలకు జీవితాన్ని ఇచ్చాడో…?

Allu Aravind Movies :మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని సాయిధరమ్ తేజ్ వరకు ఎంతోమందికి విజయాన్ని అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ విజయాల సమాహారం. చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన నాలుగు మూవీస్ గీతా ఆర్ట్స్ లోనే రూపుదిద్దుకున్నాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సారధ్యంలోని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన గజినీ మూవీ ఆల్ ఇండియా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మా పిళ్ళై సూపర్ హిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా పవన్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాస్ మూవీ. మెగా తనయుడు రామ్ చరణ్ నటించిన మగధీర హయ్యెస్ట్ గ్రాస్. రాజమౌళి డైరెక్షన్ లో భారీ ఎత్తున తీసిన మూవీ ఇది. తాజాగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీ గడిచిన సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ అయింది.
geetha govindham movie
జి ఏ 2 కింద బన్నీ వాసు సహకారంతో విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం, నాని హీరోగా భలే భలే మగాడివోయ్ మూవీ, నాగచైతన్య హీరోగా 100%లవ్ , సాయిధరమ్ తేజ్ తో ప్రతిరోజూ పండగే మూవీ .. ఇలా గీతా ఆర్ట్స్ మరిచిపోలేని విజయాలను అందించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సినిమాలు నడపడంలో అరవింద్ దూరదృష్టి అలాంటిది. అరచేతిలోకి ఇండస్ట్రీ మారుతోందని తెల్సి, తొలిసారి ఓటిటి వేదికగా ఆహా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అందుబాటులోకి తెచ్చారు. ఇండస్ట్రీలో అందరి మన్ననలు అందుకుంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."