Healthhealth tips in telugu

రాత్రి 7 తర్వాత కొన్ని తప్పులు చేయకూడదని తెలుసా ?

Ratri 7 tarvata tappulu :ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి ఇంటికి చేరుకునే వరకు తీరిక లేకుండా ఎంతో కష్టపడి అలసిపోయి ఇంటికి వస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికి తెలిసిన విషయమే.. కాని తప్పక కాలాన్ని అలా గడిపేస్తుంటారు. కాని రాత్రి 7 తరువాత చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

చాలామంది ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఏం చేస్తారు? డ్రస్ కూడా మార్చకుండా ఆదరాబాదరాగా ఏదో ఒకటి తింటుంటారు. ఇది మంచిది కాదు. సాయంత్రం తీసుకునే స్నాక్స్ కేవలం మానసికాందం కోసం తప్ప.. ఆకలి తీర్చుకోవాడానికి కాదట..! అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిన తరువాత తక్కువ స్థాయిలో ఆహారం తీసుకుంటే మానసికంగా ఆహ్లాదంగా ఉంటుందట.

ఇక సాయంత్రం తాగే టీతో పాటు చాలామంది భారీగా స్నాక్స్ లాగించేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఉండేది జంక్ ఫుడ్. మరికొద్ది సెపట్లో రాత్రి భోజనం చేసే ముందు ఇటువంటి జంక్ ఫుడ్ తీసుకొవడం అనారొగ్యానికి దారి తీస్తుంది.

చాలా మంది సాయంత్రం సమయం నుంచి మంచి నీళ్ళు తక్కువగా తీసుకుంటుంటారు. పగటి సమయంలాగే రాత్రి వేళల్లో కూడా తగిన మోతాదులో నీళ్ళు తీసుకోవాలి.

ఇక పగలంతా అలిసిపోయి ఇంటికి వచ్చినవారు గంటల తరబడి టివి చూస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. టీవీ చూడొచ్చు గాని అదే పనిగా కాకుండా ఒక గంట చూస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఆ మిగతా సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం, పుస్తకాలు చదవడం వంటివి చేస్తే మంచిదని అంటున్నారు.

చాలా మంది రాత్రి భోజనాన్ని భారీగా తీసుకుంటుంటారు. నిజానికి రోజు మొత్తం చేసే భోజనం లో బ్రేక్‌ ఫాస్ట్ కీలకం. రాత్రి భోజనానికి అంత ప్రాధాన్యత లేదు. అమితంగా ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అది కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అలాగే భోజనం చెసిన వెంటనే నిద్రించడం మంచి పద్ధతి కాదు అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."