మధ్యాహ్నం నిద్ర పోతున్నారా… లాభామా…నష్టమా…తెలుసుకోండి
Health Benefits of Napping :మనలో చాలా మంది మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త బద్ధకంగా అనిపించి పడుకుంటాం. స్కూల్ విద్యార్థులు నుంచి ఉద్యోగం చేసే వాళ్ళు,గృహిణి అలా ప్రతి ఒక్కరూ భోజనం అయ్యాక ఒక కునుకు తీస్తే రిలాక్స్ గా ఉంటుందని అంటుంటారు. అయితే మనలో చాలా మందికి భోజనం చేశాక నిద్ర మంచిదా కాదా అనే అనుమానం కూడా ఉంటుంది.

ఎటువంటి అనుమానం లేకుండా మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు కొంతమంది మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి సమయంలో నిద్ర పట్టదు అని భయపడుతూ ఉంటారు. అందులో నిజం లేదు ఆరోగ్యంగా ఉన్నవారు అరగంట సేపు పడుకోవచ్చు
అలా పడుకుంటే మానసికంగా చాలా ప్రశాంతత కలుగుతుంది. అదే ఎక్కువసేపు పడుకుంటే మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి అరగంట సేపు నిద్ర మంచిదే.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

