MoviesTollywood news in telugu

స్టార్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి

Telugu actress Sai Pallavi :తెలుగు రాష్ట్రాల్లో ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటి సాయి పల్లవి ఒక డ్యాన్సర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే డబ్బుకి కాకుండా పాత్రకు విలువనిచ్చి సినిమాల ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు ఇప్పటికే భారీ ఆఫర్స్ చాలా ఆఫర్స్ కాదనుకుంది. అయినా సరే, ఏరికోరి ఈమె కోసం క్యూ కట్టిమరీ తమ సినిమాల్లో ఆమె డిమాండ్ కి తగ్గట్టు సీన్స్ పెడుతున్నారు.

ఇప్పటికే పలువురి అగ్ర హీరోల సరసన అటు తమిళం, ఇటు తెలుగులో నటించి మెప్పిస్తున్న సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను నటించిన హీరోల గురించి సంచలన విషయాలు వెల్లడించింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా మూవీతో ఎంట్రీ ఇస్తూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన సాయిపల్లవి తనకు వరుణ్ తేజ్ ఎంతో స్పెషల్ అని చెప్పింది. హీరో సూర్యకు తాను పెద్ద అభి మానినని, అతనితో ఎన్జీకే సినిమాలో నటించడంతో తన కల నెరవేరిందని చెప్పింది.

శర్వానంద్ తో కల్సి ‘పడిపడి లేచే మనసు’ సినిమాలో సాయిపల్లవి నటించిన నేపథ్యంలో అతడి గురించి చెబుతూ శర్వానంద్ పాత్రలో జీవిస్తాడని పేర్కొంది. ఎంసీఏ సినిమాలో నానితో కలిసి చేసిన నేపథ్యంలో సినిమాకోసం నాని ఎంతో కష్టపడతాడని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఇక తమిళ హీరో ధనుష్ సినిమా సెట్ లో ఉన్నప్పుడు తన టెన్షన్ ను పోగొట్టేవాడని తెల్పింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."