MoviesTollywood news in telugu

రిలీజ్ ముందే నెట్ లో దర్శనమిచ్చిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Tollywood movies leaked online :ఒకప్పుడు సిడిల రూపంలో  పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీని కుదిపేయగా, ఇక నెట్ లో ముందుగానే లీక్ లు అవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోరకంగా బయటకు వచ్చేస్తున్నాయి. ఒక్కోసారి సినిమా రిలీజ్ కి ముందు కూడా కొన్ని సన్నివేశాలు లీక్ అవుతున్నాయి. చిన్నా పెద్ద సినిమాలనే తేడా లేకుండా బయటకు వచ్చేస్తున్నాయి.  దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కి, ఇండియ‌న్ సినిమా స్థాయిని ఓ రేంజికి తీసుకెళ్లిన బాహుబ‌లి మూవీ కూడా  ముందుగానే  ఇంట‌ర్నెట్ లోకి ఎక్కింది. విశేషమేమిటంటే, తొలి భాగం ఎడిటింగ్ దశలోనే కొన్ని యుద్ధ స‌న్నివేశాలు లీకయ్యాయి.ఇక రెండో పార్ట్ కు సంబంధించి 50 నిమిషాల మూవీ పైర‌సీ అయ్యింది. ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేసి,కొంత మందిని అరెస్టు చేశారు.

అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్ మూడు పాత్రలలో నటించిన  జై లవకుశ మూవీలో  చాలా సీన్స్ సినిమా విడుద‌ల‌కు ముందే లీకయ్యాయి.  ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేద్దామనుకునే లోగా  జై క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్ ఇంట‌ర్నెట్ లో ప్రత్యక్షమైంది.  అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తొలిసారిగా వచ్చిన అర‌వింద స‌మేత‌ వీర రాఘవ మూవీ  సైతం పైర‌సీ అయ్యింది. నాగ‌బాబు తార‌క్ మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాలు ఇంట‌ర్నెట్ లో వెలుగుచూశాయి.  గీతా గోవిందం సినిమా క్లైమాక్స్ సీన్స్ సినిమా విడుద‌ల‌కు ముందే నెట్ లో హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే సదరు నిర్మాత ఫిర్యాదుతో  పోలీసులు విచారణ చేపట్టగా, సినిమాకు ప‌ని చేసిన ఓ వ్య‌క్తే ఈ లీకేజీకి పాల్ప‌డ్డ‌ట్లు గుర్తించారు.

ఇక రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ  రంగస్థలం పోస్ట‌ర్స్, ప్ర‌మెష‌న‌ల్ డేటా ఇంట‌ర్నెట్ లో లీక్ చేశారు. టాక్సీవాలా మూవీ అయితే, డ‌బ్బింగ్ స్టేజ్ లోనే  పైర‌సీ కాపీ మొత్తం ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యింది. ప్లాప్ అనే టాక్ కూడా వ‌చ్చింది. అయితే  ఒరిజిన‌ల్ మూవీ అద్భుతంగా రావ‌డంతో హిట్ అయ్యింది. సంక్రాంతికి రిలీజైన మాస్ట‌ర్ మూవీలో చాలా సీన్స్ ఇంట‌ర్నెట్ లో క‌నిపించాయి. అలాగే రోబో 2. ఓ  టీజ‌ర్ క్లిప్పింగ్స్ అఫీషియ‌ల్ గా రిలీజ్ చేయ‌క ముందే ఇంట‌ర్నెట్ లో దర్శనమిచ్చాయి. యష్ నటించిన కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ కావడంతో  పాన్ ఇండియా మూవీగా  కేజీఎఫ్ 2 తెరకెక్కుతోంది. అయితే  టీజ‌ర్ రిలీజ్ డేట్ క‌న్నా ఒక్క రోజు ముందే యూట్యూబ్ లో ప్ర‌త్య‌క్షం అయ్యింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."