MoviesTollywood news in telugu

సుమంత్ ని దురదృష్టం ఎన్ని రకాలుగా వెంటాడిందో తెలుసా?

Tollywood Hero Sumanth :వరుస ప్లాప్ లు, వదిలేసుకున్న సూపర్ హిట్స్, అచ్చిరాని పెళ్లి ఇలా హీరో సుమంత్ కెరీర్ ని ఆపేసాయి. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమకథ మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు,నాగార్జున మేనల్లుడు సుమంత్ తొలి సినిమాతో ప్లాప్ అందుకున్నాడు. శివ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సమయంలో వచ్చిన ప్రేమకథ పరాజయం కావడం సుమంత్ కెరీర్ ని డైలమాలో పడేసింది. అయితే మూడేళ్ళ తర్వాత సత్యం మూవీతో బ్రేక్ వచ్చింది.

కానీ అదృష్టం లేకపోవడంతో సెన్షేషన్ హిట్ అంటూ సుమంత్ కెరీర్ లో లేకుండా పోయింది. గౌరీ, మహానంది, గోదావరి ఇలా కొన్ని హిట్స్ వచ్చినా ఆతర్వాత నుంచి వరుస ప్లాప్ లు వెంటాడాయి. మళ్ళీరావా మూవీ ఈమధ్య కొంత ఉపశమనం కలిగించినా మళ్ళీ హిట్ పడలేదు. ఇక వచ్చిన ఛాన్స్ లు వదులుకోవడంతో అవి కాస్తా వేరే హీరోలు చేసి హిట్ కొట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, అల్లు అర్జున్ దేశముదురు, రవితేజ ఇడియట్ మూవీస్ తొలుత సుమంత్ దగ్గరకు వచ్చినప్పటికీ అవి కాదనడంతో సెన్షేషన్ హిట్స్ చేజారిపోయాయి.

అలాగే తరుణ్ చేసిన నువ్వేకావాలి, ఆకాష్ ఆనందం, గమ్యం, నువ్వు వస్తావని, అష్టాచెమ్మా, వంటి సినిమాలు కూడా వదిలేసుకున్నాడు. పెళ్లి విషయంలో ఇతడికి అచ్చి రాలేదు. తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్ళాడి, విడాకులు తీసుకున్నాడు. ఆమె మరో వ్యక్తిని పెళ్ళాడి సెటిలయింది. కానీ ఇతడికి మాత్రం మళ్ళీ పెళ్ళికాలేదు. అందం,అభినయం,టాలెంట్,బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే, సుమంత్ ని దురదృష్టం వెంటాడింది. ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వాళ్ళతో మంచి స్నేహం ఉంది. ఎపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి క్లాస్ మేట్ కూడా. ఎన్ని ఉన్నా అదృష్టం లేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."