జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల…కారణం అదేనట
jabardast comedians :ఇప్పటికీ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లే జబర్దస్త్ కామెడీ షోలో కంటెస్టెంట్స్ గా ఉంటున్న కమెడియన్స్ తమ స్కిట్స్ తో జనాన్ని అలరిస్తున్నారు కరోనా ప్రభావం ఈ షోలోని కంటెస్టెంట్స్ పై కూడా పడిందని అంటున్నారు. నిజానికి ఈ షో లో చేరినవాళ్లు పాపులార్టీతో పాటు రెమ్యునరేషన్ కూడా బాగానే అందుకుంటూ ఆర్ధికంగా స్థిరపడ్డారు. అలాగే పలు షోస్,సినిమాల్లో ఛాన్స్ లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. మొదట్లో వారానికి ఒకసారి వచ్చే జబర్దస్ తర్వాత స్పెషల్ జబర్దస్త్ పేరిట మరో షో కూడా నడుస్తూ వస్తోంది.
అయితే కరోనా ప్రభావం పలు రంగాలను కుదేలు చేసింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని దారుణంగా దెబ్బకొట్టింది. దాంతో బుల్లితెర సీరియల్స్ , షోస్ మీద జనాలు ఆధారపడ్డారు. జబర్దస్త్ షోకి మెగా బ్రదర్ నాగబాబు, రోజా జడ్జీలుగా రాణిస్తుంటే, సడన్ గా నాగబాబు ఆ మధ్య తప్పుకోగా, కంటెస్టెంట్స్ లో టీమ్ లీడరు చమక్ చంద్ర కూడా వెళ్లిపోవడంతో ఈ షో పై ఎఫెక్ట్ పడకుండా ప్రోగ్రాం నిర్వాహకులు మల్లెమాల ప్రొడక్షన్స్ ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అందుకే రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. అయితే ఇప్పుడు మరో ఏడాది వరకూ పెంపుదల ఉండదని టాక్.
అందులో భాగంగా రోజాకు ఒక్కో ఎపిసోడ్ కి మూడు నుంచి నాలుగు లక్షలు దక్కేది. ఇప్పుడు రెట్టింపు అయిందట. ఇక నాగబాబు ప్లేస్ లో వచ్చిన సింగర్ మనో కి రెండు లక్షలు చొప్పున ఇస్తున్నారట. కమెడియన్స్ విషయంపైకి వస్తే, సుడిగాలి సుధీర్ కి 3లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు 4లక్షలకు చేరింది. ఇప్పుడు హైపర్ ఆది కి 3లక్షల వరకూ, అలాగే అదిరే అభి 2లక్షలు, రాకెట్ రాఘవ 2. 75లక్షలు, బులెట్ భాస్కర్ – చలాకి చంటి 2లక్షలు చొప్పున అందుకుంటున్నారట. ఇక యాంకర్ రేష్మి ఒక్కో ఎపిసోడ్ కి 80వేలు అందుకోగా, పెంచిన రేటు ప్రకారం లక్షకు చేరిందట.

