Healthhealth tips in telugu

ఈ అడవి దోసకాయలు ఎక్కడైనా కనబడితే అసలు వదలద్దు… ఎందుకంటే

Adavi Dosa benefits in telugu : నూగు దోస లేదా ముగుముగు దోసకాయ అని పిలిచే ఈ మొక్కలో ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. చిన్నతనంలో పిల్లలు సెలవు రోజు వస్తే ఈ కాయలను సేకరించి తినడానికి ఇష్టపడే వారు.

చేదు రుచి కలిగిన ఈ కాయలు చూడటానికి దోసకాయలు వలే అనిపిస్తాయి ఈ కాయలు మలబద్ధకం, గ్యాస్ సమస్య, అజీర్ణం, ఆకలి లేకపోవటం, ఆందోళన,ఉబ్బసం, పొడి దగ్గు, రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.దీనిని తమిళనాడులో ప్రసిద్ధ మూలికలలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు.

ఈ మొక్క ఆకుల కషాయాలను రక్తపోటు చికిత్సకోసం తమిళనాడులో సిద్ధ వైద్యులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ అడవి దోసలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది మూత్ర సంబంధ సమస్యలు తగ్గించటానికి కూడా సహాయపడుతుంది కొంతమంది సాంప్రదాయ వైద్యుడు కామెర్లు నివారణకు కూడా ఈ ఆకుల కషాయాన్ని ఉపయోగిస్తున్నారు ఇటువంటి మొక్కలను ఆరోగ్యపరంగా ఉపయోగించినప్పుడు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుడి సంపాదించి వాడటం చాలా ముఖ్యం