MoviesTollywood news in telugu

మిస్సమ్మ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో…?

Missamma Movie Facts : విజయా సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ ఆణి ముత్యాలే. అందులో మిస్సమ్మ మూవీ ఒకటి. ఇప్పటికీ ఈ మూవీ టివిలో వస్తుంటే, ఆడియన్స్ ఆసక్తిగా చూస్తారు. అప్పట్లో మాటల మాంత్రికుడిగా పేరొందిన పింగళి నాగేంద్రరావు మాటలు,పాటలు అందించగా సాలూరి రాజేశ్వరరావు అద్భుతమైన మెలోడీ సంగీతాన్ని అందించారు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకొని విజయవంతంగా నడిచింది.

తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్,ఏ ఎన్ ఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీలో సావిత్రి,జమున హీరోయిన్స్ గా చేసారు. అయితే ఇందులో సావిత్రి బదులు మొదట్లో భానుమతిని తీసుకున్నారట. కొన్ని సీన్లు కూడా తీసాక,ఆమె స్తానంలో సావిత్రిని ఒకే చేశారట. భానుమతి ఒకరోజు షూటింగ్ కి ఆలస్యంగా రావడంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి ఈ నిర్ణయం తీసుకున్నారట.

అయితే భానుమతి,సావిత్రి హీరోయిన్స్ గా భావించి, తర్వాత భానుమతి ప్లేస్ లో సావిత్రిని పెట్టారు. అలాగే సావిత్రి కోసం అనుకున్న పాత్రను జమున చేత చేయించారు. అలా మార్పులతో రూపుదిద్దుకున్న మిస్సమ్మ తెలుగు చిత్ర సీమలో ఆణిముత్యంగా మిగిలింది. ఈ మూవీ తర్వాతే సావిత్రి తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకెళ్లిందని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."