Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు పాలల్లో ఉడికించి తింటే కీళ్లనొప్పులు,అధికబరువు,రక్తహీనత,బలహీనత ఉండవు

Atukula payasam with jaggery Benefits In telugu :ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, పోషకాలు లేని ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవటం వంటి కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్య రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా చేయాలి. దీని కోసం ఒక రెమెడీ తెలుసుకుందాం.

పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాస్ పాలను పోసి కొంచెం వేడెక్కాక 3 స్పూన్ల అటుకులను వేసి ఉడికించాలి. ఆ తర్వాత రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక పొయ్యి మీద నుంచి దించేయాలి. దీనిని అటుకుల పాయసం గా చెప్పవచ్చు.
Jaggery Health Benefits in Telugu
ఈ అటుకుల పాయసంను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. ఈ పాయసంను వారంలో 2 సార్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను లేదా సాయంత్రం సమయంలో అయిన తీసుకోవచ్చు. ఈ పాయసం తినటం వలన కీళ్లనొప్పులు, అధిక బరువు, రక్తహీనత, శారీరక బలహీనత,అలసట వంటివి అన్నీ తొలగిపోతాయి.

అటుకులు,పాలు,బెల్లంలో ఉన్న పోషకాలు అన్నీ శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇవన్నీ మనకు ఇంటిలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ అటుకుల పాయసం తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.