Face Glow Tips;2 నిమిషాల్లో ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా తెల్లగా,కాంతివంతంగా మారాలంటే…
Lemon And Honey Glowing Skin In Telugu : ప్రతి ఒక్కరు ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా రెడీ అవుతారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకొనే చిట్కాతో తక్కువ ఖర్చుతో ముఖాన్ని అందంగా కాంతి వంతంగా మార్చుకోవచ్చు. చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి,మలినాల కారణంగా చర్మం నిర్జీవంగా కనపడుతుంది.
ఇప్పుడు చెప్పే చిట్కా దుమ్ము,ధూళి,నలుపును సమర్ధవంతంగా తొలగిస్తుంది.ఈ చిట్కాకు అవసరమైన అన్ని వస్తువులు మన ఇంటిలో అందు బాటులో ఉండేవే. ఈ చిట్కాను చాలా సులువుగా చేయవచ్చు. ఈ చిట్కాకు అవసరమైన ఇంగ్రిడియన్స్ ఏమిటో తెలుసుకుందాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ నిమ్మరసం, ఒక విటమిన్ E Capsule ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 2 నిముషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా పది రోజుల పాటు చేస్తూ ఉంటె ముఖం కాంతివంతంగా,తెల్లగా మారుతుంది.
ఈ చిట్కాలో ఉపయోగించిన నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ముఖ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు తేనెలో సమృద్ధిగా ఉండుట వలన వృద్దాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి.
ఇక విటమిన్ E చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. అలాగే చర్మంపై ఉన్న ముడతలు,ఫైన్ లైన్స్ ని సమర్ధవంతంగా తొలగిస్తుంది. విటమిన్ E Capsule మెడికల్ Shops లో లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


