Beauty TipsHealthhealth tips in telugu

పార్లర్‌తో పనిలేదు.. ఈ 2 నిమిషాల రెమెడీతో మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది!

Lemon And Honey Glowing Skin In Telugu : కాలుష్యం, ఎండల వల్ల ముఖం కాంతివిహీనంగా మారి, నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా? బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పనిలేదు! మీ ఇంట్లోనే ఉండే సహజమైన పదార్థాలతో కేవలం 2 నిమిషాల్లో మీ చర్మాన్ని నిగనిగలాడేలా, మచ్చలు లేకుండా ఎలా మార్చుకోవాలో ఈ ఆర్టికల్‌లో చదివి తెలుసుకోండి. గ్లోయింగ్ స్కిన్ ఇక మీ సొంతం!

ప్రతి ఒక్కరు ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా రెడీ అవుతారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకొనే చిట్కాతో తక్కువ ఖర్చుతో ముఖాన్ని అందంగా కాంతి వంతంగా మార్చుకోవచ్చు. చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి,మలినాల కారణంగా చర్మం నిర్జీవంగా కనపడుతుంది.

ఇప్పుడు చెప్పే చిట్కా దుమ్ము,ధూళి,నలుపును సమర్ధవంతంగా తొలగిస్తుంది.ఈ చిట్కాకు అవసరమైన అన్ని వస్తువులు మన ఇంటిలో అందు బాటులో ఉండేవే. ఈ చిట్కాను చాలా సులువుగా చేయవచ్చు. ఈ చిట్కాకు అవసరమైన ఇంగ్రిడియన్స్ ఏమిటో తెలుసుకుందాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ నిమ్మరసం, ఒక విటమిన్ E Capsule ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 2 నిముషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా పది రోజుల పాటు చేస్తూ ఉంటె ముఖం కాంతివంతంగా,తెల్లగా మారుతుంది.

ఈ చిట్కాలో ఉపయోగించిన నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ముఖ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు తేనెలో సమృద్ధిగా ఉండుట వలన వృద్దాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి.

ఇక విటమిన్ E చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. అలాగే చర్మంపై ఉన్న ముడతలు,ఫైన్ లైన్స్ ని సమర్ధవంతంగా తొలగిస్తుంది. విటమిన్ E Capsule మెడికల్ Shops లో లభ్యం అవుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."