కేవలం 7 రోజుల్లో అద్భుతం.. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, నీరసం ఇక మాయం!
Joint Pains Home Remedies In Telugu : రోజూ ఉదయం లేవగానే నడుము నొప్పి.. అడుగు తీసి అడుగు వేయాలంటే మోకాళ్ళ నొప్పులు.. ఏ చిన్న పని చేసినా విపరీతమైన నీరసం. ఇవన్నీ శరీరంలో కాల్షియం తగ్గడం వల్లే వస్తాయని మీకు తెలుసా? రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడి విసిగిపోయిన వారికోసం ఒక అద్భుతమైన ఇంటి వైద్యం ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
కేవలం 7 రోజుల పాటు నేను చెప్పినట్లుగా ఈ చిట్కా పాటించి చూడండి, మీ శరీరంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఆ రెమెడీ ఏంటి, ఎలా వాడాలో ఇక్కడ వివరంగా చదివి ట్రై చేయండి

కొంచెం పని చేసినా త్వరగా అలసిపోవడం, ఎముకలు పేలుసుగా మారటం, కీళ్లలో నొప్పులు ఉండటం, కూర్చుని లేవటం కష్టం అవటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
శీతాకాలంలో నొప్పులు అనేవి సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో వచ్చే నడుం నొప్పి, భుజాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు కారణంగా రోజువారి పనులు కష్టం అవుతాయి.
కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఎముకలు బలహీనంగా మారటానికి calcium, విటమిన్ డి లోపం కారణంగా నొప్పులు ఉంటాయి. సాధారణంగా 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల్లో ఈ లోపం కనబడుతుంది.
కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి.ఇప్పుడు చెప్పే ఈ పాలను తాగితే శారీరక బలహీనత తొలగిపోతుంది. కాల్షియం సప్లిమెంట్ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
దీని కోసం పొయ్యి మీద పాన్ పెట్టి 6 బాదం పప్పులు,12 ఫుల్ మఖాన, పావుస్పూన్ మెంతులు, ఒక స్పూన్ గసగసాలు, పావుస్పూన్ పసుపు, పావు స్పూన్ శొంఠి, ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసి సిమ్ లో పెట్టి వెగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ పొడి కలిపి ఉదయం లేదా సాయంత్రం తాగితే సరిపోతుంది. ఈ పాలను తీసుకోవటానికి ముందు పొట్ట అరగంట ఖాళీగా ఉంటే మంచిది. వారం రోజులు తాగి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మరల వారం రోజులు తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శారీరక బలహీనత తొలగిపోతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

