Healthhealth tips in telugu

పరగడుపున 7 రోజులు ఇది తింటే చాలు.. కొలెస్ట్రాల్, అధిక బరువు ఇట్టే కరిగిపోతాయి!

Honey And Garlic Health benefits In telugu :పెరుగుతున్న బరువు, భయపెడుతున్న కొలెస్ట్రాల్.. ఈ రోజుల్లో ఇవి ప్రతి ఇంట్లోనూ వినిపిస్తున్న సాధారణ సమస్యలు. వీటివల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు వస్తాయేమో అన్న భయం మనల్ని నిత్యం వేధిస్తూనే ఉంటుంది. వీటికి తోడు తరచుగా వచ్చే గొంతు సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి.

వీటన్నింటికీ చెక్ పెట్టడానికి డైట్‌లు, జిమ్‌లు అంటూ విపరీతంగా కష్టపడకముందు, కేవలం 7 రోజుల పాటు పరగడుపున ఈ చిన్న ఇంటి చిట్కాను ట్రై చేసి చూడండి.

మన వంటింట్లో దొరికే వస్తువులతోనే తయారయ్యే ఈ అద్భుతమైన రెమెడీ మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఎలా సహాయపడుతుందో ఈ పోస్ట్‌లో వివరంగా రాశాను. ఒకసారి చదివి మీరూ ప్రయత్నించండి!
Garlic Benefits in telugu
ప్రతి రోజు పరగడుపున తేనె,వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగు తాయి. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మీరు కూడా తప్పనిసరిగా తేనె,వెల్లుల్లి తినటం ప్రారంభిస్తారు.

చాలా మంది తేనె,వెల్లుల్లి విడివిడిగా తీసుకుంటూ ఉంటాయి. తేనె,వెల్లుల్లి రెండింటిలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రెండింటిని కలిపి తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనె వేసి దానిలో రెండు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట అలా వదిలేసి ఆ తర్వాత తినాలి. ఈ విధంగా వారం రోజులు తీసుకొని ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల వారం రోజుల పాటు తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండవలసిన అవసరం ఉంది. ధమనుల్లో ఏర్పడే ఫ్యాట్ ని తొలగించి.. గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది.

దాంతో గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.తేనె, వెల్లుల్లిలో యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఉండుట వలన గొంతుకి సంబందించిన సమస్యలు గొంతు నొప్పి,గొంతు ఇన్ ఫెక్షన్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.

జీర్ణ సంబంధ సమస్యలను ఎదుర్కోవడంలో తేనె,వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి తేనె,వెల్లుల్లి మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. దాంతో బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."