Healthhealth tips in telugu

ఒక్క గ్లాసు పాలలో ఇది కలిపి తాగితే చాలు.. నొప్పులు, నీరసం, తిమ్మిర్లు మాయం!

Joint Pains Home Remedies in Telugu :కీళ్లనొప్పులు, రక్తహీనత, శారీరక బలహీనత మరియు తిమ్మిర్లతో బాధపడుతున్నారా? రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో ఈ చిన్న పదార్థం కలిపి తాగితే చాలు. గుండెపోటు లాంటి ముప్పును కూడా తగ్గించి, సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఈ అద్భుతమైన చిట్కా గురించి పూర్తిగా తెలుసుకోండి.

ప్రస్తుతం మారిన పరిస్థితి కారణంగా మనలో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు.

చిన్న చిన్న సమస్యలకు ఇంటి చిట్కాలు సరిపోతాయి. ఈ రోజు కీళ్లనొప్పులు,రక్తహీనత ,శారీరక బలహీనత వంటి సమస్యలను తగ్గించటానికి ఒక రెమిడీ తెలుసుకుందాం. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
kismis benefits in telugu
దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 6 కిస్ మిస్ లను వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన పాలను గ్లాస్ లో పోసి కిస్ మిస్ తింటూ పాలను తాగాలి. ఈ విధంగా 10 రోజుల పాటు తాగితే మీకు మంచి ఫలితం కనపడుతుంది.

ఈ పాలను ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఉదయం సమయంలో తాగితే రోజంతా ఉషారుగా ఉంటారు. కిస్ మిస్ ని పాలల్లో ఉడికించినప్పుడు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల పరిమాణం పెరుగుతుంది. దాంతో ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులువంటి వన్నీ తొలగి పోతాయి.

రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఈ పాలను తాగితే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఎందుకంటే దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. గుండెకి సంబంధించిన సమస్యలు, అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు వంటి వాటిని తగ్గిస్తుంది. ఎందుకంటే కిస్ మిస్ పాలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఈ పాలను తాగితే శారీరక బలహీనత,అలసట, నిసత్తువ అన్ని తొలగిపోతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."