నరాల బలహీనతకు శాశ్వత చెక్… ఈ పదార్థాలతో అద్భుతమైన రిజల్ట్!
Nerves weakness home remedies in telugu : కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం, ఏ చిన్న పని చేసినా అలసిపోవడం, వణుకు… నరాల బలహీనత (Nerve Weakness) వల్ల వచ్చే ఇలాంటి ఇబ్బందులు మన రోజువారీ జీవితాన్ని ఎంత కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో మందులు వాడినా ప్రయోజనం కనిపించకపోతే ఒకసారి మన వంటగదిలోని అద్భుతమైన ఔషధాల వైపు చూడండి.
బాదం (Almond), దాల్చిన చెక్క (Cinnamon)— నరాలకు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఈ రెండింటినీ కలిపి నేను చెప్పిన విధానంలో తీసుకుంటే.. నరాల బలహీనత తగ్గడమే కాదు, మళ్లీ జన్మలో ఆ సమస్య మీ దరిచేరదు. ఆ పవర్ఫుల్ హోమ్ రెమెడీ ఏంటో ఇప్పుడే చదివి తెలుసుకోండి!
నరాల బలహీనత అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కండ్ల నుంచి నీరు కారడం. అనుకోని సంఘటనలు చూసినా, విన్నా గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవడం, రాయాలంటే చేతులు వణకడం తదితర సమస్యలను చూస్తుంటాం.

ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా తొందరగా అలసటకు గురి అవుతారు. ఆహారం లోపం వలన ,ఫిజికల్ గా ఎటువంటి పని చేయకపోయినా,వయస్సు పెరిగే కొద్దీ ఈ నరాల బలహీనత వస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఈ నరాల బలహీనత నుంచి బయట పడవచ్చు.
సాధారణంగా నరాల బలహీనత రాగానే చాలా మంది టాబ్లెట్స్ వాడుతూఉంటారు. ఆలా మందులు వాడకుండా ఇంటిలోనే మంచి పోషక ఆహారం తీసుకోని ఈ నరాల బలహీనత నుండి బయట పడవచ్చు.
సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచనలను పాటించాలి. ఈ చిట్కా కోసం ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు అవిసే గింజలు, అరకప్పు బాదం పప్పు, 2 స్పూన్ల మిరియాలు, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని ప్రతి రోజు అరస్పూన్ పొడిని గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగాలి. ఈ విధంగా తాగటం వలన నరాల బలహీనత తగ్గటమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు. అలసట లేకుండా ఉంటుంది. సహజసిద్ధమైన పదార్ధాలు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

