Healthhealth tips in telugu

ఇలా చేస్తే నోటి పూత నిమిషాల్లో మాయం అవుతుంది…అసలు అశ్రద్ద చేయవద్దు

Mouth Ulser Home Remedies : వేసవికాలం ప్రారంభం అయింది. ఈ కాలంలో అధిక వేడి కారణంగా నోటిలో పొక్కులు,నోటి పూత వంటివి వస్తాయి. పొక్కులు,పూత వచ్చాయంటే తినాలన్న తాగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటి పొక్కులను,పూతను తగ్గించుకోవటానికి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే చాలా మంచి ఫలితం ఉంటుంది.
pasupu benefits
వంటింటిలో రెగ్యులర్ గా వాడే పసుపు ఈ నోటి పొక్కులను,పూతను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. పసుపులో నీటిని కలిపి పొక్కులు,పూత ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

పసుపులో యాంటీ వైరల్,యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఇన్ ఫ్లేమేటరీ లక్షణాలు ఉండుట వలన పుండ్లు తొందరగా తగ్గటమే కాకుండా నొప్పి కూడా తగ్గుతుంది. పసుపు మార్కెట్ లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములతో ఆడించిన పసుపు వాడితే మంచిది. ప్యాకెట్ పసుపు లో కెమికల్స్ కలిసే అవకాశం ఉంది.

నోటి పొక్కులు,పూత వచ్చినప్పుడు ఈ రెమిడీ ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.