డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నాలుక ఎందుకు చూస్తారో తెలిస్తే…

why doctors see tongue :మానవ దేహమే ఒక దేవాలయం అంటారు. ఈ దేహంలో ప్రతి అంగానికి ఓ ప్రాధాన్యత వుంది. అందులో ఏది లేకున్నా లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మానవ శరీర అంతర్భాగాల్లో మిగతా వాటితో నాలుక సరిసమానమైనది అంటారు. ఇది కేవలం రుచులు తెలుసుకోవడానికే కాదు.
Tongue color
అది మన ఆరోగ్యాన్ని తెలిపే ఒక కొలమానం కూడానని అంటున్నారు. నాలుక, రంగు, మృదుత్వం, తేమల ద్వారా శరీరం లోలోపల ఏం జరుగుతోందో బయటపెడుతుంది. ఎడతెగకుండా లాలాజలాన్ని పంపడం ద్వారా నోట్లోని బ్యాక్టీరియానంతా బయటకు పంపుతూ నోటిని శుభ్రం చేస్తుంది. సహజంగా లేత పింక్ కలర్ లో, తేమగా, మృదువుగా ఉండే నాలుక ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే ఒక సూచన.

డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు నాలుకను పరిశీలించడం ద్వారా డాక్టర్లు ఎనీమియా నుంచి విటమిన్, లవణాల లోపాల దాకా డీ- హైడ్రేషన్ నుంచి కిడ్నీ సమస్యల దాకా నాలుకను చూడటం ద్వారానే తెలుసుకుంటారు. వీటితో పాలు రక్త ప్రసరణ స్థాయి, కొలెస్ట్రాల్ నిలువలు, అలర్జీలు, జీర్ణాశయ సమస్యలు ఇవన్నీ బయటపడతాయి. నాలుక మీద కనిపించే ప్రధాన లక్షణాలు తెలుసుకుందాం..

నాలుక పాలిపోయి ఉంటే, రక్తంలో హిమోగ్లోబిన్ లోపాలు, ఇనుము లోపించిన ప్రొటీన్ ఉన్నాయని గ్రహించాలని అంటున్నారు. ఇవి నీరసం నిస్సత్తువల ద్వారా బయటపడుతూ ఉంటాయి సమతులాహారం తీసుకోవడం ద్వారా ఆ లోపాలను అధిగమించవచ్చట.

నాలుక ఎరుపు రంగులో ఉంటే, అది విటమిన్ బి-12, ఫోలిక్ యాసిడ్ లోపాలు ఉన్నట్టు భావించాలట. వైరల్ ఇన్ ఫెక్షన్ల కారణంగా మీకు జ్వరం ఉన్నప్పుడు కూడా నాలుక ఎర్రబడుతుందని అంటున్నారు.

నాలుక ఊదా రంగులో ఉంటే, శరీరంలో కొలెస్ట్రాల్ నిలువలు పెరిగాయని అర్థం అని అంటారు. ఇది రక్త సరఫరా సరిగా లేదని తెలిపే సూచన కూడా ఉందట. రక్తప్రసరణ సజావుగా జరగాలంటే వ్యాయామాలు తప్పనిసరి.

నలుపు రంగులో ఉంటే శరీరంలో రక్తకణాలు చనిపోయే వేగానికి మించి రక్తకణాల ఉత్పత్తి అధికంగా ఉందనుకోవాలి. అతిగా యాంటీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల కూడా కొందరిలో ఈ సమస్య తలెత్తవచ్చని అంటున్నారు.

అంతే కాకుండా పొగతాగడం, అతిగా కాఫీలు తాగడం, దంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు. కొందరి నాలుక మీద బొడిపెలు ఉంటాయి. వీటిని పాపిలే అంటారు. అవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి.

మామూలుగా అయితే చూయింగ్, డ్రింకింగ్ వల్ల నాలుక మీద పెద్ద ప్రభావం ఉండదు కానీ, కొన్ని సార్లు నాలుక మీదున్న బొడిపెలు పెరుగుతాయి. ఇదే సమయంలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువవుతుంది. నాలుక తన సహజ వర్ణాన్ని కూడా కోల్పోతుంది.

నాలుక మీద అల్సర్లు ఏర్పడితే వ్యాధి నిరోధక శక్తి తగ్గిందనుకోవాలట. వైరల్ ఇన్ ఫెక్షన్ లతో సమస్య వచ్చినా అది అంటు వ్యాధి మాత్రం కాదు. చల్లటి పాలు, పెరుగు, నిమ్మ నీళ్లు సేవిస్తే అల్సర్లు వేగంగా తగ్గే అవకాశం ఉంది.

ఏది ఏమైనా నాలుక సమస్యలు ఎక్కువ కాలంగా బాధిస్తూ ఉంటే వెంటనే జనరల్ ఫిజిషియన్ ను కలవడం తప్పనిసరని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.