1 లడ్డు తింటే అలసట,నీరసం,నిస్సత్తువ తగ్గటమే కాకుండా రక్తహీనత సమస్య జీవితంలో ఉండదు
Healthy protein laddu : ఈ రోజు ఒక లడ్డు తయారీ తెలుసుకుందాం. ఒక లడ్డు ఎన్నో సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. అధిక బరువు,కీళ్ల నొప్పులు, అలసట, నీరసం,రక్తహీనత, నిద్రలేమి వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఈ లడ్డు కోసం అవిసె గింజలు,తెల్ల నువ్వులు,బాదం, బెల్లం తీసుకుంటున్నాం.

ముందుగా పాన్ పొయ్యి మీద పెట్టి ఒక కప్పు అవిసె గింజలు, ఒక కప్పు నువ్వులు, అరకప్పు బాదం పప్పు వేసి వేగించాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం, కొంచెం నీటిని వేసి ముదురు పాకం వచ్చేలా కలపాలి. దీనిలో పైన తయారుచేసుకున్న పొడిని వేసి కలిపి పొయ్యి మీద నుంచి దించేయాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. రోజుకి ఒక లడ్డు తింటే సరిపోతుంది. బాదంలో ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్, జింక్ , విటమిన్ ఇ వంటివి సమృద్దిగా ఉన్నాయి. తెల్ల నువ్వుల్లో ఐరన్,కాపర్, విటమిన్ b6,థయామిన్,నియాసిన్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి.
అవిసె గింజల్లో ఫైబర్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కూడా బాగా బలంగా పెరిగేలా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.నీరసం,బలహీనత ఉండదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

