అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా… అయితే ఈ విషయాలు తప్పనిసరి…మిస్ కావద్దు

aluminium cookware : మనం ఇంటిలో ఎక్కువగా ఉపయోగించే వంట పాత్రలలో అల్యూమినియం ఒకటి. సాధారణంగా ప్రతి ఇంటిలో అల్యూమినియం పాత్రలు కనబడుతూనే ఉంటాయి. కనపడని ఇల్లు ఉందంటే అతిశయోక్తి కాదేమో. అయితే డాక్టర్స్ అల్యూమినియం పాత్రలు వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు.
aluminum
టమాటా వంటి యాసిడ్ కలిగిన ఆహారాలను ఉండినప్పుడు, అలాగే పుల్లని పదార్థాలను వండినప్పుడు వాటిలో ఉండే యాసిడ్ అల్యూమినియంలో కలిసి కొన్ని అనారోగ్య సమస్యలు రావటానికి కారణం అవుతుంది. అంతేకాకుండా అల్యూమినియం పాత్ర లో వంట చేసినా, చేసిన వంటను నిల్వచేసిన క్రమంగా విషంగా మారుతుంది.

ఒక రకంగా చెప్పాలంటే ఈ పాత్రలో వండుకుని వంటలను తింటే స్లో పాయిజన్ గా పనిచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారాలు తింటే బిపి, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, కిడ్నీ సమస్యలు వంటివి వస్తాయి. కాబట్టి ఇ అల్యూమినియం పాత్రలలో వంటలు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి.

ప్యూర్ అల్యూమినియం కాకుండా ఎనోడైజ్డ్ అల్యూమినియం మెటల్‌తో తయారు చేసిన పాత్రలు వాడితే అది వంటల్లో కలిసే ప్రమాదం అంతగా ఉండదని పరిశోధకులు చెప్తున్నారు.