Healthhealth tips in telugu

రోజూ పరగడుపున తులసి రసంలో తేనె కలుపుకుని తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Tulsi with honey Benefits In telugu : వాతావరణం మారినప్పుడల్లా మనల్ని వెంటనే వేధించే సమస్యలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి మరియు జ్వరం. వీటికి ప్రతిసారీ ఇంగ్లీష్ మందులు, యాంటీబయోటిక్స్ వాడే బదులు, మన పెరట్లోనే ఉండే ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధంతో చెక్ పెట్టవచ్చు.

అదే ‘తులసి మరియు తేనె’ కాంబినేషన్. ప్రాచీన కాలం నుండి తులసిని ఒక పవిత్రమైన మొక్కగానే కాకుండా సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో వాడుతున్నారు. యాంటీ-వైరల్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండే తులసి ఆకుల రసానికి, సహజసిద్ధమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉండే స్వచ్ఛమైన తేనె తోడైతే శరీరానికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ రెండింటి మిశ్రమం రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడమే కాకుండా, శ్వాసకోశ సమస్యలను (Respiratory Issues) ఇట్టే దూరం చేస్తుంది. అసలు తులసి, తేనె కలిపి తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? ఏయే అనారోగ్య సమస్యలకు ఇది సంజీవనిలా పనిచేస్తుంది? ఈ మిశ్రమాన్ని సరైన పద్ధతిలో ఎలా తయారు చేసుకుని తీసుకోవాలో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.

తులసి,తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక స్పూన్ తులసి రసంలో అరస్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఒక స్పూన్ తేనెలో 4 తులసి ఆకులను రెండు గంటలు నానబెట్టి కూడా తీసుకోవచ్చు.
Tulasi Health benefits in telugu
దీనిలో అనేక రకాల న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ ఉండటం వలన శరీరానికి ఎక్కువ పోషకాలను అందించి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. దగ్గు,జలుబు వంటి సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది నేచురల్ డికంజెస్టెంట్ గా పనిచేసి శ్వాస సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది.

యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన ఎలర్జీ సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన సెల్ జనరేషన్ నుప్రోత్సహించి ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. దాంతో కిడ్నీలలో టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తొలగించడంతో సహాయపడి కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది.

శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మన ఇంటిలో ఉండే వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."