Healthhealth tips in telugu

నరాల బలహీనత, చేతులు మరియు కాళ్ల వణుకును తగ్గించే అద్భుతమైన హెర్బల్ టీ

Maruvam Tea benefits In telugu : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది నరాల బలహీనత, తీవ్రమైన ఒత్తిడి, మరియు చేతులు, కాళ్ల వణుకు వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ సమస్యల వల్ల రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. అయితే, మన వంటగదిలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసుకునే ఒక అద్భుతమైన టీతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఈ న్యాచురల్ టీ తాగడం వల్ల నాడీ వ్యవస్థ (Nervous System) బలపడటమే కాకుండా, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నరాల బలహీనతను తగ్గించి, కాళ్లు చేతుల వణుకును మాయం చేసే ఆ స్పెషల్ టీ ఏమిటి? అందులో వాడే పదార్థాలు ఏవి? ఆ టీని ఎలా తయారు చేసుకోవాలో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.

వయస్సు పెరిగే కొద్ది కొంతమందిలో నరాల బలహీనత,చేతులు,కాళ్ళు వణకటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయట పడటానికి ఒక టీ గురించి తెలుసుకుందాం. మరువంతో టీ తయారుచేసుకోవాలి. మరువం అంటే మనలో చాలా మందికి తెలుసు. పూల మాలల మధ్య మరువం వేసి మాల కడుతూ ఉంటాం.

అయితే మరువంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ విషయం మనలో చాలా మందికి తెలియదు. మరువం టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో 15 నుంచి 20 మరువం ఆకులను వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె వేసుకొని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగుతూ ఉంటే నరాల బలహీనత,చేతులు,కాళ్ళ వణుకు క్రమంగా తగ్గుతాయి. రక్తప్రసరణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ టీ ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించి నరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

మరువంలో శోధ నిరోధక లక్షణాలు ఉండుట వలన సైనస్ తలనొప్పి, శారీరక నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు, మైగ్రేన్‌లు, పంటి నొప్పి మరియు ఉబ్బసం వంటి సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. శక్తివంతమైన సహజ యాంటీ-ఆక్సిడెంట్‌లలో ఒకటైన ఆస్కార్బిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."