ఈ ఒక్క డ్రింక్ తాగారంటే.. ఒంట్లో వేడి తగ్గి ఇమ్యూనిటీ డబుల్ అవుతుంది!
Tulasi Drink : వేసవి వచ్చినా రాకపోయినా, ఒక్కోసారి మన శరీరంలో వేడి బాగా పెరిగిపోయి చాలా ఇబ్బంది పెడుతుంది కదా! కడుపులో మంట, విపరీతమైన నీరసం, అలసట వస్తుంటాయి. ఇలాంటప్పుడు కూల్‌గా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తుంది.
బయట దొరికే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కాకుండా… మన ఇంట్లోనే చాలా సులభంగా చేసుకునే ఒక అద్భుతమైన డ్రింక్ గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను.
ఇది తాగితే క్షణాల్లో ఒంట్లో వేడి తగ్గడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తి (Immunity) కూడా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ మ్యాజిక్ డ్రింక్ ఏంటో, ఎలా చేయాలో చూసేద్దామా! రండి!

మిక్సీ జార్ లో అరకప్పు తులసి ఆకులు, ఒక కప్పు లేతకొబ్బరి, 10 మిరియాలు,అరకప్పు కొబ్బరి నీరు, 2 స్పూన్ల తేనె వేసి బాగా మిక్సీ చేసి గ్లాస్ లో పోసి తాగాలి.
ఇలా తాగితే ఎండ దెబ్బ, వడదెబ్బ, అలసట,నీరసం, నిస్సత్తువ వంటివి ఏమి లేకుండా హుషారుగా ఉంటారు. తులసిలో యాంటీ ఫంగల్,యాంటీ వైరల్,యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి.
వేసవిలో కొబ్బరి నీరు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగి మంచి ఫలితాన్ని పొందండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

