Healthhealth tips in telugu

అరస్పూన్ తీసుకుంటే చాలు 300 పైగా వ్యాధులను నయంచేస్తుంది షుగర్, కొలెస్ట్రాల్, రక్తహీనత అనేవి అసలు ఉండవు

Moringa Leaves Powder : మనం ఎక్కువగా మునగకాడలను వాడుతూ ఉంటాం. అలాగే మునగ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా చాలా సమృద్దిగా ఉంటాయి. మునగ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.

ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరస్పూన్ మునగ ఆకుల పొడిని కలిపి తాగాలి. అవసరం అనుకుంటే ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి కూడా తాగవచ్చు. ఇలా ప్రతి రోజు తాగుతూ ఉంటే దాదాపుగా 300 పైగా వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెప్పుతున్నారు.

డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మునగ ఆకులు చాలా మేలును చేస్తాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి, కొలెస్ట్రాల్ లేకుండా రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. మునగ ఆకులలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటమే కాకుండా రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది.
Drumstick leaves benefits in telugu
మునగ ఆకులో ఆరెంజ్ కన్నా 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. పాలు కన్నా 17 రెట్లు ఎక్కువ calcium ఉంటుంది. క్యారెట్ లో కన్నా 10 రెట్లు విటమిన్ A ఉంటుంది. పెరుగులో కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అరటిపండు కన్నా 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. పాలకూరలో కన్నా 25 రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.