Healthhealth tips in telugu

బరువు తగ్గాలని ఓట్స్ తింటున్నారా? అసలు నిజం తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు!

Oats weight loss : అధిక బరువుతో బాధపడేవారు రోజూ ఓట్స్ తింటే మీ శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో ఓట్స్ ఎలా పనిచేస్తాయి మరియు వీటిని తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాల కోసం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగటం అనేది చాలా సులువుగా జరిగిపోతుంది…అదే బరువు తగ్గాలంటే చాలా కష్టపడాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి.
oats benefits
అలాగే బరువును తగ్గించటానికి సహాయపడే ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాలలో ఓట్స్ ఒకటి. అందుకే ఈ మధ్య చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఓట్స్ తింటున్నారు. ఓట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, పొటాషియం, నియాసిన్, విటమిన్ ఎ, బి6, బి12, విటమిన్ డి మొదలైన పోషకాలు ఉన్నాయి

ఓట్స్ లో ఉండే బీటా గ్లూకాన్ అనేది మన శరీరంలో ఒక హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఆకలిని నియంత్రిస్తుంది.కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి త్వరగా వేయదు. ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడటమే కాకుండా మన శరీరంలో శక్తి స్థాయిని కూడా నిర్వహిస్తుంది.

ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొవ్వు శోషణను నిలిపివేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఓట్స్ ని నీటిలో లేదా పాలల్లో ఉడికించి తీసుకోవచ్చు. అలా కాకుండా ఉప్మా, ఇడ్లీలు వలె చేసుకొని తినవచ్చు.

ఈ విధంగా బరువును తగ్గించే ఆహారాలను తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తే తప్పనిసరిగా 15 రోజుల్లో తేడా కనపడుతుంది. కాబట్టి ఓట్స్ తింటూ ఉంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య తగ్గుతుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."