Healthhealth tips in telugu

భోజనం చేశాక తమలపాకులో 3 మిరియాలు వేసుకుని నమిలితే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

Chew betel leaves with Black pepper : భోజనం అయ్యాక తమలపాకులో మూడు మిరియాల గింజలు పెట్టి నమిలితే మీ ఆరోగ్యంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? జీర్ణక్రియ మెరుగుపడటం, గ్యాస్ సమస్యలు తగ్గడం మరియు రోగనిరోధక శక్తి పెరగడం వంటి ఆశ్చర్యకరమైన ప్రయోజనాల కోసం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!

అధిక బరువును తగ్గించుకోవటానికి తమలపాకు,మిరియాలు చాలా బాగా సహాయపడతాయి. అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి వేలకొద్ది దబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో దొరికే వస్తువులతో సులభంగా బరువు తగ్గవచ్చు.
Weight Loss tips in telugu
పూర్వకాలంలో భోజనం చేసిన తర్వాత తమలపాకులు తినేవారు. ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని అలా తమలపాకును తినేవారు. ఆయుర్వేద వైధ్య నిపుణులు తమలపాకు,మిరియాలు కలిపి తింటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారని చెప్పుతున్నారు.

తమలపాకులు మన శరీరంలోని జీర్ణ శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. తమలపాకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండుట వలన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయని ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడింది. మన శరీరం యొక్క జీవక్రియ రేటును పెంచటమే కాకుండా కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్‌ను తటస్థీకరిస్తుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఉండదు.

మిరియాలలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు, పెప్పరిన్ అనేవి శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గించి, మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను మన శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తాయి. కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి మనం తినే ఆహారం కడుపులో బాగా జీర్ణం చేస్తుంది. శరీరం నుండి విషాలను బయటకు పంపుతుంది.

తాజా తమలపాకులో మూడు మిరియాలను పెట్టి ఆకును మడిచి నోటిలో పెట్టుకుని నమలాలి. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇలా చేస్తే మీ శరీరంలోని జీర్ణశక్తి పెరుగుతుంది. దాదాపుగా రెండు నెలలలో బరువు తగ్గుతారు. పచ్చిగా మరియు తాజాగా ఉన్న తమలపాకును మాత్రమే ఉపయోగించాలి. అలాగే తమలపాకులపై నల్లటి మచ్చలు ఉంటే తినకూడదు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."