రోజుకు 1 గ్లాస్ చాలు.. పొట్ట, తొడల చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
Cinnamon Basil Tea Benefits : మారిన జీవనశైలి, గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ‘బరువు పెరగడం’. ముఖ్యంగా పొట్ట, నడుము, మరియు తొడల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును (Belly and Thigh Fat) తగ్గించుకోవడం అంత తేలికైన విషయం కాదు.
ఆ వేలాడే పొట్టను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల డైట్లు చేసి, కఠినమైన వ్యాయామాలు చేసి విసిగిపోయారా? అయితే మీ బాధలన్నింటికీ చెక్ పెట్టే ఒక అద్భుతమైన చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ శరీరంలోని ఫ్యాట్ ను వెన్నలా కరిగించే ఆ అద్భుతమైన డ్రింక్ ఏమిటి?
దాన్ని ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలి? అందులో వాడే ఆ ఆరోగ్యకరమైన పదార్థాలు ఏమిటి? ఈ డ్రింక్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరానికి కలిగే ఇతర లాభాలేంటి? వంద శాతం మెరుగైన ఫలితాల కోసం దీన్ని ఎలా తాగాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం. చదివి మీరు కూడా ట్రై చేయండి!
ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు కంగారూ పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరినీ వేదిస్తున్న సమస్యలలో అధిక బరువు సమస్య ప్రధానమైనది.

అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పే టీ తాగుతూ మంచి పోషకాహారం తింటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తే చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 6 తులసి ఆకులు, అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.
బాగా మరిగిన ఈ నీటిని వడకట్టి తాగాలి. డయాబెటిస్ లేనివారు అరస్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు. ఈ టీని ప్రతి రోజు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. 15 రోజులు తాగితే తేడా గమనించి చాలా ఆశ్చర్యపోతారు. తులసిలో ఉన్న లక్షణాలు జీర్ణశక్తిని పెంచుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
దాల్చినచెక్క శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా చేసి అధిక బరువును తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం ఆకలిని అదుపులో ఉంచుతుంది. దాంతో ఆహారం తక్కువ తీసుకోవటం వలన బరువు తగ్గుతాము. అలాగే ఈ టీ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ టీ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సీజనల్ గా వచ్చే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ టీని తాగి ఆ ప్రయోజనాలను పొందండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

