1 గ్లాసు వారంలో 2 సార్లు ఊహించని ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి…
kiwi juice Benefits In Telugu : కివీ పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కివీ పండ్లు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి. కాబట్టి వారంలో 2 సార్లు కివీ పండుతో తయారుచేసిన జ్యూస్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఒక కివీ పండును తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

ఈ ముక్కలను మిక్సీలో వేసి ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి, ఈ జ్యూస్ ని గ్లాసులో పోసి ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. కివీలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కివీలో పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాక రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

కివీలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కివీలో ఉండే అనేక రకాల విటమిన్లు కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తాయి.

శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఈ సీజన్ లో ఎక్కువగా వచ్చే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ తగ్గించటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

అలాగే పిల్లల్లో వచ్చే గురకను తగ్గిస్తుంది. కివీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు విటమిన్ ఇ మరియు పాలీఫెనాల్స్ ఉండుట వలన నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అనేక యాంటీ ఆక్సిడెంట్లు మరియు సెరోటోనిన్ ఉండుట వలన నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

