Healthhealth tips in telugu

కాలీఫ్లవర్ Vs బ్రకోలీ: ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్? మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!

Cauliflower vs Broccoli Benefits : కాలీఫ్లవర్, బ్రకోలీ.. ఈ రెండూ క్యాబేజీ కుటుంబానికి చెందిన పోషకాల గనులు. చూడటానికి ఒకేలా (రంగు మినహా) ఉండే ఈ రెండు క్రూసిఫెరస్ కూరగాయలలో దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్? విటమిన్లు, మినరల్స్ పరంగా ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఏమిటి? అసలు ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? కాలీఫ్లవర్ మరియు బ్రకోలీల గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన నిజాలను, ఏది తింటే ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

కాలీఫ్లవర్ మరియు బ్రకోలీ రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది మంచిదో చూద్దాం. కాలీఫ్లవర్ తో పోలిస్తే పోషక విలువలు బ్రకోలీ లోనే ఎక్కువగా ఉన్నాయి. కాలీఫ్లవర్ రుచి కొంచెం తీపి రుచిలో ఉంటుంది.
cauliflower-improves-blood-circulation-in-winter
అదే బ్రకోలీ రుచి కాస్త తక్కువగా ఉంటుంది. ఈ రెండింటినీ కూరగా చేసినప్పుడు ఆ తేడా తెలియదు. కాలీఫ్లవర్ మరియు బ్రకోలీ రెండింటిలోను తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఈ రెండింటినీ తినవచ్చు. కాలీఫ్లవర్ lo తక్కువ కేలరీలు ఉండుట వలన బరువు తగ్గాలనే ప్రణాళిక ఉన్నవారికి మంచిది.

బ్రకోలీలో పోలేట్ ఎక్కువగా ఉండుట వలన గుండె ఆరోగ్యానికి అవసరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. బ్రకోలీలో కాల్షియం
కూడా ఎక్కువగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ మరియు బ్రకోలీ రెండింటిలోను మాంగనీస్‌ పుష్కలంగా ఉంటుంది.

అయితే బ్రకోలీలో మాంగనీస్ ఎక్కువగా ఉండుట వలన ఎముకల సాంద్రతను నిర్మించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆర్థరైటిస్ మరియు ఇతర ఎముకలకు సంబందించిన సమస్యలతో బాధపడేవారికి బ్రకోలీ మంచిది. కాలీఫ్లవర్ కంటే బ్రకోలీలో ఉన్న మరొక ప్రయోజనం ఏమిటంటే, డిటాక్స్ ప్రక్రియలో సహాయపడే ఫైటోన్యూట్రియెంట్స్ బ్రకోలీలో ఉంటాయి.

ఇది చాలా తక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది శరీరానికి అవసరమైన పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌ను కూడా కలిగి ఉంటుంది. మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన స్థూల పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఒక కప్పు వండిన బ్రకోలీలో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటే…ఒక కప్పు వండిన కాలీఫ్లవర్ లో 2.5 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది.

ఇక కేలరీల విషయానికి వస్తే ఒక కప్పు వండిన బ్రకోలీలో 44 కేలరీలు ఉంటే…ఒక కప్పు వండిన కాలీఫ్లవర్ లో 29 కేలరీలు ఉంటాయి. ఇక కాలీఫ్లవర్ మరియు బ్రకోలీలో ఏది ఆరోగ్యానికి మంచిది…అనే విషయానికి వస్తే రెండు కూడా మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రెండింటినీ తినటానికి ప్రయత్నం కెఃయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."