ఆరోగ్యానికి మంచిదని పెసలు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారికి అది ముప్పే!
Who Should Not Eat Moong Dal : పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, మోతాదు మించితే కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెసలను ఎక్కువగా తీసుకుంటే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సమస్యలు ఏంటి? పెసలు ఎవరు తినకూడదో ఈ ఆర్టికల్లో వెంటనే తెలుసుకోండి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మన శరీరానికి ప్రోటీన్ వంటి పోషకాలు అందాలంటే పెసలను తీసుకోవాలి. మనలో చాలా మంది పెసలను మొలకలుగా చేసుకొని తింటూ ఉంటారు. పెసలలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి కొన్ని సమస్యలు ఉన్నవారు పెసలకు దూరంగా ఉండాలి.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు పెసలను తింటే రక్తపోటు తగ్గి నియంత్రణలోకి వస్తుంది. అందువల్ల తక్కువ తక్తపోటు సమస్యతో బాధపడేవారు పెసలను ఎక్కువగా తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకుంటే మంచిది. రక్తపోటు తక్కువ ఉన్నవారు తింటే రక్తపోటు మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.
జీర్ణ సంబంద సమస్యలు అయినా గ్యాస్,కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు పెసలను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే పెసలలో ఉండే ఒకరకమైన కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియలో సమస్యలు రావటానికి కారణం అవుతాయి. అందువల్ల వారంలో రెండు సార్లు తగిన మోతాదులో తీసుకుంటే సరిపోతుంది.
పెసలు డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అయితే Low Blood Sugar తో బాధపడేవారు పెసలను చాలా లిమిట్ గా తీసుకోవాలి. ఎందుకంటే పెసలను ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి పెసలను తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కీళ్ల నొప్పులు వస్తాయి. అందువల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ఆహారానికి దూరంగా ఉండాలి. తక్కువ రక్తపోటు, Low Blood Sugar, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు, జీర్ణ సమస్య ఉన్నవారు పెసలను లిమిట్ గా తీసుకోవాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

