1 గ్లాసు ఇలా తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాన పొట్ట ప్లాట్ గా మారుతుంది
Weight Loss Milk In telugu : మారిన జీవన శైలి పరిస్థితులు, ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ఫోన్, టీవీ చూస్తూ ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవడం, కొన్ని రకాల మందులు వాడటం,హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఇంటిలోనే సహజసిద్దమైన పదార్ధాలతో పాలను తయారుచేసుకుందాం. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే పాలను తీసుకుంటే చాలా తొందరగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోయాలి. పాలు కాస్త వేడి అయ్యాక అర స్పూను పచ్చి పసుపు కొమ్ము తురుము. చిటికెడు మిరియాల పొడి. చిటికెడు జాజికాయ పొడి. చిటికెడు లవంగాల పొడి. పావు స్పూన్ వాము. అర స్పూను అల్లం తురుము. పావు స్పూన్ ములేటి పొడి. రెండు ఖర్జూరాలను పేస్ట్ గా చేసి వేయాలి.

7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించి ఈ పాలను వడగట్టి తీసుకోవాలి. ఈ పాలను ఉదయం లేదా రాత్రి పడుకోవడానికి గంట ముందు తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు పెరగడమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది .

అలాగే సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఉదయం సమయంలో తాగితే అలసట, నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త శ్రద్ద పెడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

