1 లడ్డు తింటే నీరసం,అలసట,రక్తహీనత,కీళ్ల నొప్పులు, చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది
Ragi laddu Benefits in telugu : ఈ రోజుల్లో సమస్యలు అనేవి చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. అందువల్ల ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాలి. .

ఇప్పుడు చెప్పే లడ్డుని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.పొయ్యి మీద పాన్ పెట్టి నాలుగు స్పూన్ల తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఒక కప్పు రాగి పిండి వేసి మంచి వాసన వచ్చేవరకు వెగించి పక్కన పెట్టాలి.

ఆ తర్వాత అదే పాన్ లో రెండు స్పూన్ల కొబ్బరి తురుము వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న నువ్వులు, రాగి పిండి, కొబ్బరి తురుము, అర స్పూన్ యాలకుల పొడి, 6 స్పూన్ల బెల్లం తురుము వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో మూడు స్పూన్ల నెయ్యి వేసి లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.

ఈ లడ్డూలను ఫ్రిజ్ లో పెడితే 15 రోజులపాటు నిల్వ ఉంటాయి. ప్రతిరోజు ఒక లడ్డు తింటూ ఉంటే .శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. నీరసం., అలసట, నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా రక్తహీనత సమస్య కూడా కనబడుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడటానికి ఈ లడ్డు చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. .

అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డును తయారు చేసుకుని ప్రతిరోజు ఒక లడ్డు తినడానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

