అల్లంతో ఇలా చేస్తే ఆగకుండా వస్తున్న దగ్గు, జలుబు, గొంతులో గరగర నిమిషంలో మాయం
Cough and Cold Home remedies : ఈ సీజన్ లో వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి.
100 గ్రాముల అల్లం (Ginger) తీసుకుని స్టవ్ అన్ చేసుకుని మంట మీద లైట్ గా కాల్చుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి అల్లం పేస్టు, 400 గ్రాముల బెల్లం (jaggery) తురుము, రెండు స్పూన్ల నీళ్లు వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. .
అరస్పూన్ వాము (ajwain),ఒక స్పూన్ మిరియాల పొడి (Pepper Powder) వేసి బాగా కలిపి ఒక స్పూను నెయ్యి వేసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్ లో Ghee రాసి ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా పరుచుకొని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఉదయం సమయంలో పరగడుపున ఒక ముక్క తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. రక్తప్రసరణ బాగా జరిగేలా చేయటమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కఫాన్ని తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి., గొంతులో గరగర, గొంతు నొప్పి వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గించడానికి పనిచేస్తుంది.
దీనిని allam murabba అని కూడా పిలుస్తారు. ఇది మార్కెట్లో లభ్యమవుతుంది. కానీ మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకుంటేనే మంచిది. ఈ allam murabba దాదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కాబట్టి allam murabba తయారుచేసుకొని ఇప్పుడు చెప్పిన సమస్యల నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.