Healthhealth tips in telugu

పైసా ఖర్చులేకుండా డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్ కౌంట్ ని క్షణాల్లో పెంచే అద్భుతమైన ఆకులు

Blood platelet count Home remedies In Telugu : ఈ మధ్య డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా తీవ్రంగా పడిపోతుంది. దీని వలన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. కాబట్టి శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య సహజంగా పెంచే కొన్ని ఆకులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం
blood thinning
నేలవేము
నేల వేము ఆకు శుభ్రంగా కడిగి గ్లాస్ నీటిలో వేసి ఆర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం అరగ్లాసు సాయంత్రం అరగ్లాసు ఐదు రోజులపాటు తీసుకుంటే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెంచుకోవచ్చు
neem Leaves
వేపాకులు
వేపాకులు నీటిలో కలిపి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. దీన్నుంచి రసాన్ని తీసి రోజుకు 10 ml మూడు సార్లు చొప్పున తీసుకుంటే రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది
Menthi Kura Health benefits in telugu
మెంతి ఆకులు
మెంతి ఆకులను.శుభ్రంగా కడిగి నీటిలో వేసి రెండు గంటల తర్వాత ఆ నీటిని తాగాలి. ఈ విధంగా తాగటం వలన రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది
Tulasi Health benefits in telugu
తులసి ఆకులు
గుప్పెడు తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలిపి తీసుకుంటే వారం రోజుల్లో రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది
Health Benefits In tippatiga
తిప్పతీగ
తిప్పతీగ సర్వరోగనివారిణి అని మనకు తెలుసు. ఈ ఆకులు మూడు తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి ప్రతి రోజు తాగుతుంటే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది
papaya Leaf Health Benefits In Telugu
బొప్పాయి
బొప్పాయి ఆకు గురించి మనలో చాలా మందికి తెలుసు.బొప్పాయి ఆకు రసాన్ని డాక్టర్ సూచించిన ప్రకారం తీసుకుంటే రక్తంలో ప్లేటెట్స్ .సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక దానిని కనీసం నాలుగు రోజులపాటు తీసుకుంటే సహజంగా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.