Healthhealth tips in telugu

మెంతులు,తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Fenugreek seeds with Honey benefits in Telugu : మెంతులు, తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులను తేనెను కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక స్పూన్ తేనెలో పావుస్పూన్ మెంతులను వేసి బాగా కలిపి మూడు గంటలు అలా వదిలేసి ఆ తర్వాత తినవచ్చు.
fenugreek seeds
లేదంటే ఒక స్పూన్ తేనెలో పావుస్పూన్ మెంతి పొడి కలిపి తినవచ్చు…లేదంటే మెంతులను నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి తేనె కలిపి తాగవచ్చు. ఈ విధంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆయుర్వేదంలో తేనె,మెంతులను ఎక్కువగా వాడతారు. ఉదయం సమయంలో పరగడుపున తీసుకుంటే అధిక బరువు సమస్య తగ్గుతుంది.
Honey
ఈ మిశ్రమం బరువును నియంత్రించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెంతులు మరియు తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు నయమవుతాయి. మెంతులు జీర్ణ శక్తిని బలపరుస్తాయి. తేనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పొత్తికడుపు వాపు, నొప్పి మరియు మలబద్ధకం,గ్యాస్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
gas troble home remedies
మెంతులు మరియు తేనె తీసుకోవడం ద్వారా తల్లి పాలు పెరుగుతాయి. మెంతులలో సపోనిన్‌ ఉండుట వలన కొవ్వు పదార్ధాల నుండి కొలెస్ట్రాల్‌ను శరీరం గ్రహించడాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో మెంతులను తేనెతో కలిపి తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరంలోని ఎల్‌డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
Joint Pains
మెంతులు,తేనె రెండింటిలోను యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన శరీరంలో వాపులను తగ్గించటమే కాకుండా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.