Fenugreek Leaves Benefits: మెంతికూర తినడం లేదా.. అయితే మీరు నష్టపోయినట్లే..!
Fenugreek Leaves Health Benefits In Telugu : చలికాలంలో ఆకుకూరలు చాలా విరివిగా లభిస్తాయి. ఆకుకూరలను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అంది ఎటువంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే చలికాలంలో విరివిగా లభించే ఆకుకూరల్లో మెంతికూర తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. మెంతికూర చాలా తక్కువ ఖర్చులోనే లభ్యం అవుతుంది.
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు మెంతి కూరను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మెంతి ఆకులలో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలో ఆస్టియో-ట్రోఫిక్ కార్యకలాపాలను ప్రేరేపించడం ద్వారా ఎముక బలాన్ని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా శరీరంలో కాల్షియం లోపం లేకుండా చేస్తుంది. ఎముకలలో కాల్షియం లోపిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి.
మెంతి ఆకులో సహజసిద్దంగా కరిగే ఫైబర్ గెలాక్టోమన్నన్. ఇది చక్కెర రక్తంలోకి శోషించబడే రేటును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి బాధ్యత వహించే అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా మెంతికూరను ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
మెంతికూరలో గెలాక్టోమన్ను కలిగి ఉన్నందున గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
మెంతికూరలో ఫినాలిక్ మరియు ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు సమృద్దిగా ఉండుట వలన యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని మెరుగుపరచి ఎటువంటి వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి మెంతికూరను వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి. మెంతికూరతో పప్పు, కూర, పచ్చడి ,మసాలా వంటలు చేసుకోవచ్చు .
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


