Healthhealth tips in telugu

Weight Loss Tea:ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు కరగటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు..

Masala Tea For Weight Loss : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. వాటి నుంచి బయట పడటానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన వంటింటిలో ఉండే కొన్ని సహజసిద్దమైన పదార్ధాల్తో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

ఈ సమస్యల నుండి బయట పడటానికి మిరియాల టీ చాలా బాగా సహాయపడుతుంది. నల్ల మిరియాలు శరీరంలోని కొవ్వు మరియు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నల్ల మిరియాలలో మెగ్నీషియం, విటమిన్ కె మరియు ఐరన్‌తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఇది కీళ్లలో నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతాకాలంలో రక్తపోటును నియంత్రిస్తుంది. అంతే కాకుండా దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. మిరియాలలో ఉన్న లక్షణాలు తీసుకున్న ఆహారం చాలా వేగంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

మిరియాలలో ఉండే పైపెరిన్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయటమే కాక శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. శరీరంలో కేలరీలు చాలా త్వరగా శోషించబడతాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అధిక బరువును తగ్గించటానికి మిరియాల టీ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక ఆరు మిరియాలను కచ్చా పచ్చాగా దంచి వేయాలి. ఆ తర్వాత అర అంగుళం అల్లం ముక్కను దంచి వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఉదయం సమయంలో తాగాలి.

ఈ విధంగా ప్రతి రోజు తాగితే 15 రోజుల్లో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటం ప్రారంభం అయ్యి బరువు తగ్గుతారు. ఈ టీలో ఉపయోగించిన మిరియాలు, అల్లం, నిమ్మరసంలలో ఉన్న లక్షణాలు బరువు తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ టీని ఈ సీజన్ లో తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."