Healthhealth tips in telugu

Strawberries Benefits: స్ట్రాబెర్రీతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలు వదలరు

Strawberries benefits In telugu : ఈ సీజన్ అంటే చలికాలంలో తీసుకొనే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో ప్రతి రోజు రెండు స్ట్రాబెర్రీలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. ఇప్పుడు చాలా విరివిగా లభిస్తున్నాయి.

అలాగే సీజన్ కానప్పుడు డ్రై స్ట్రాబెర్రీ కూడా దొరుకుతుంది. చూడటానికి ఎరుపురంగులో ఆకర్షణీయంగా ఉండే స్ట్రాబెర్రీ అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో ప్రస్తుతం విరివిగానే లభిస్తున్నాయి. కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగా లాభాలను అందిస్తుంది. స్ట్రాబెర్రీ లో ఆరెంజ్ కన్నా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధులు రాకుండా చేస్తుంది.

ముఖ్యంగా సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. దాంతో యవ్వనంగా కనిపిస్తారు. స్ట్రాబెర్రీ లో షుగర్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఆల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా చేయడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది.

దీనిలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు,పొటాషియం గుండెకు రక్తసరఫరా మెరుగుపరచి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగు పడటమే కాకుండా కంటి సమస్యలు తగ్గుతాయి. కంటిలో శుక్లాలు ఏర్పడకుండా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

స్ట్రాబెరీలో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ సమృద్దిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు తరచుగా స్ట్రాబెర్రీలను తింటే అంటే వారంలో మూడు సార్లు తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. స్ట్రాబెరీలో ఎలాజిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్. ఇది ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడమే కాకుండా గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.