MoviesTollywood news in telugu

Telugu Serial Heroes:“తెలుగు సీరియల్” హీరోల రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ ఎవరికో…?

Telugu serial heroes remunerations: ఒకప్పుడు టివీ సీరియల్స్ లో నటించే నటి నటులకు పెద్దగా రెమ్యూనరేషన్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు సినిమా హీరోల కన్నా ఎక్కువ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. అలాగే ప్రేక్షకుల్లో ఎంతో ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక వారి రెమ్యూనరేషన్స్ విషయానికి వస్తే..

కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా ప్రేక్షకుల్లో స్థానం సంపాదించిన నిరుపం రోజుకి 40౦౦౦ వేల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో హీరో ఆర్యవర్ధన్‌గా నటిస్తున్న శ్రీరామ్ రోజుకి 40౦౦౦ వేల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఒక పక్క నటిస్తూనే మరొక పక్క సీరియల్స్ నిర్మిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.

బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ ఇప్పుడు చాలా తక్కువ సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఒక్క రోజుకి 35౦౦౦ వరకు తీసుకుంటాడు.

చక్రవాకం, మొగులిరేకులు లాంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో అలరించిన ఇంద్ర నీల్ రోజుకి 30౦౦౦ వేల వరకు తీసుకుంటాడు.

బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్న మానస్ రోజుకి 25౦౦౦ వరకు తీసుకుంటాడు.

గుప్పెడంత మనసు సీరియల్‌లో హీరోగా నటిస్తున్న కన్నడ యాక్టర్ ముఖేష్ గౌడ మొదట్లో రోజుకి 15౦౦౦ తీసుకొనేవాడు. కానీ ఆ సీరియల్ కి మంచి రేటింగ్ రావటంతో ఇప్పుడు ముఖేష్ గౌడ రోజుకి 25౦౦౦ వరకు తీసుకుంటున్నాడు.

ఒకప్పటి తెలుగు స్టార్ హీరో సాయి కిరణ్ గుప్పెడంత మనస్సు, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ లో నటిస్తూ రోజుకి 30 నుంచి 35౦౦౦ వేల వరకు తీసుకుంటున్నాడు.

జానకి కలగనలేదు సీరియల్‌లో హీరోగా నటిస్తున్న అమమర్ దీప్ చౌదరి రోజుకి 20౦౦౦ వరకు తీసుకుంటాడు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో హీరో నటిస్తున్న కన్నడ పాపులర్ బుల్లితెర నటుడు గగన్ చిన్నప్ప రోజుకి 20౦౦౦ వరకు తీసుకుంటాడు.

ముత్యాల ముగ్గు, నా పేరు మీనాక్షీ, కథలో రాజకుమారి, కళ్యాణం కమనీయం సీరియల్స్ హీరో మధుసూదన్ రోజుకి 15 నుంచి 20 వేల వరకు తీసుకుంటాడు.

త్రినయని సీరియల్ లో నటిస్తున్న చందు గౌడ రోజుకి 25౦౦౦ వరకు తీసుకుంటాడు.