MoviesTollywood news in telugu

Sridevi కోసం 1980లో ఒక అభిమాని ఎన్నిలక్షలు ఖర్చు పెట్టాడో తెలుస్తే షాక్ అవుతారు?

Tollywood Heroine Sridevi : తమ అభిమాన హీరో, హీరోయిన్ ల గురించి ఏ విషయం అయినా తెలుసుకోవాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె ఏ హీరోతో నటించిన ఆమె ఆ హీరోకి సరైన జోడి అని అనిపించుకుంది. అప్పట్లో ఆమె అందం అంటే యూత్ కే కాకుండా సినిమా హీరోలకు కూడా చాలా క్రేజ్ ఉండేది. ఆమెకు పోటీగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చిన శ్రీదేవికి సాటి రాలేదు.

ఆమె రెండు తరాల నటులతో నటించిందంటే ఆమె హవా ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి శ్రీదేవి ఆకస్మిక మరణం అందరిని కలిచి వేసింది. ఆమె మరణ వార్త విన్న తర్వాత ఆమె గురించి సినీ రంగంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని బాషల వారు వారి భావాలను చాలా బాధతో వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత,దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఆమె గురించి మాట్లాడుతూ…80 వ దశకంలో శ్రీదేవి అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేది. దానికి ఉదాహరణగా తమ్మారెడ్డి భరద్వాజ ఒక సంఘటన గురించి చెప్పారు.

నేను చదువు ముగించుకొని సినిమాల్లోకి అడుగు పెట్టిన తోలి రోజుల్లో దుబాయ్ నుంచి ఒక స్నేహితుడు ఫోన్ చేసి శ్రీదేవిని చూడటానికి రెండు లక్షల రూపాయిలను ఇస్తానని చెప్పాడు.

షూటింగ్ లో జస్ట్ చూపిస్తే చాలు. పరిచయం కూడా చేయవలసిన అవసరం లేదని అన్నాడు. ఆ రోజుల్లో రెండు లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే. అలాంటిది శ్రీదేవిని చూడటానికి రెండు లక్షలు ఇస్తానని అంటే శ్రీదేవి క్రేజ్ యువతలో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."