Healthhealth tips in telugu

ఊదా క్యాబేజీ లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు!

purple cabbage Benefits in telugu : సాధారణ క్యాబేజీతో పోలిస్తే ఊదా రంగు క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడం వరకు.. ఊదా క్యాబేజీ మన ఆరోగ్యానికి చేసే అద్భుతాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

క్యాబేజీలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఊదా క్యాబేజీ కూడా విరివిగానే లభిస్తుంది.ఊదా క్యాబేజీలో విటమిన్లు A, C మరియు K, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం మరియు పొటాషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
Purple Cabbage
ఊదా క్యాబేజీని వారంలో రెండు సార్లు తింటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ఈ క్యాబేజీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణక్రియ ప్రక్రియలో ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఉడికించిన క్యాబేజీని తినడం వల్ల అజీర్ణం,గ్యాస్,కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.

కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గే అవకాశం ఉంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు తింటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడటమే కాకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

ఊదా క్యాబేజీలో విటమిన్ సి orange కన్నా ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని విషాలను బయటకు పంపుతాయి. అలాగే కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి.

కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ కె, పొటాషియం,కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు మరియు కండరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యాబేజీలో ఉండే ఆంథోసైనిన్లు అల్జీమర్స్ వ్యాధిని నిరోధించడంలో సహాయపడతాయి. మరియు ఫలకం ఏర్పడకుండా నిరోధించడం ద్వారా మెదడును కాపాడి జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."