MoviesTollywood news in telugu

Mahesh Babu మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

Mahesh first movie collections: మహేష్ బాబు సినిమాలను చాలా సెలక్టివ్ గా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా పలు సినిమాల్లో బాలనటుడిగా అభిమానులచేత సెహబాష్ అనిపించుకున్న మహేష్ బాబు ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి విభిన్న తరహా సినిమాలతో ప్రిన్స్ స్టార్ సూపర్ స్టార్ అయ్యాడు.
mahesh babu
మహేష్ మూవీ వస్తోందంటే అభిమానులతో పాటు జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. అంతలా క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు, పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి, గుణశేఖర్ తీసిన ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో హై రేంజ్ కి చేరిన మహేష్ బాబు త్వరలోనే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో కూడా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన తొలిమూవీ రాజకుమారుడు సినిమాని అశ్వినీదత్ నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఎంట్రీ ఇస్తూ రిలీజ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే 48లక్షల షేర్ వసూలు చేసిన ఈ మూవీ 37సెంటర్స్ లో 100డేస్ ఆడింది. మొదటి సినిమాతోనే 8కోట్ల వసూళ్లు రాబట్టిన రాజకుమారుడు మూవీలో మహేష్ నటన అన్ని కోణాల్లో అదరగొట్టాడు.