పాలు+తులసి వేడి చేసి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Tulasi Milk Benefits In telugu : పాలు,తులసి రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసుకుందాం. తులసి,పాలను కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తులసి పాలను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి మరిగించి 4 తులసి ఆకులను వేసి ఒక నిమిషం మరిగించి గ్లాస్ లో పోసి తులసి ఆకులను నములుతూ పాలను తాగాలి. ఈ విధంగా తాగటం వలన తులసిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, పాలలోని హీలింగ్ ప్రాపర్టీ, శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తుంది.

తులసిలో యుజినాల్ అని పిలువబడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, పాలల్లో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నాడీ వ్యవస్థకు విశ్రాంతిని ఇచ్చి ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రించి ఆందోళన మరియు నిరాశ వంటి పరిస్థితులను తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది.

తలనొప్పిని తగ్గిస్తుంది. తులసి పాలను లిమిట్ గా తీసుకోవాలి. అయితే వేడి పాలల్లో తులసిని కలిపి ఎక్కువగా తీసుకుంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తులసి పాలను తాగకూడదు. అలాగే రక్త స్రావం సమస్యలు ఉన్నవారిలో సమస్య తీవ్రతరం అవుతుంది.
Diabetes diet in telugu
డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని చాలావరకు తగ్గిస్తుంది. అందువల్ల డయబెటిస్ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తులసి, పాలు రెండూ కూడా మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి తాగటానికి ప్రయత్నం చేసి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.