1 Spoon పొడి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లేకుండా ఎముకలు దృడంగా ఉంటాయి
Joint Pains Powder In telugu: మోకాళ్ళ నొప్పులు,కీళ్ళనొప్పులు అనేవి ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. మారిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు ఉండటం వంటి అనేక రకాల కారణాలతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి వస్తున్నాయి.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పొడిని తయారు చేసుకుని నిలువ చేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
ఈ చలికాలంలో నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పొడిని వాడితే నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు ఫూల్ మఖానా, ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు వాల్నట్స్, ఒక కప్పు జీడిపప్పు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టాలి. అదే పాన్ లో అరకప్పు నువ్వులు, అరకప్పు గుమ్మడి గింజలు వేసి వేగించుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేగించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, నువ్వులు, జీడిపప్పు, వాల్ నట్స్, ఫూల్ మఖానా, బాదంపప్పు, నాలుగు యాలకులు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ పొడి కలిపి తాగాలి. రుచి కోసం అరస్పూన్ బెల్లం కూడా వేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తీసుకోవాలి.
ఈ విధంగా ప్రతిరోజు ఈ పొడి కలిపిన పాలను తీసుకుంటే ఎముకలు దృఢంగా బలంగా మారి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండి వయసు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ఏమీ ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.