Fermented food at night:పులిసిన ఆహారాలను రాత్రి సమయంలో తింటున్నారా…ఈ విషయం తెలుసుకోండి
Fermented food at night:రాత్రి సమయంలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి సమయంలో ఇడ్లీ, దోశ వంటి పులిసిన ఆహారాలను తింటే మన ఆరోగ్యానికి మంచిదా…కాదా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. కొంత మంది పులిసిన ఆహారాన్ని తినటానికి ఇష్టపడతారు. పులిసిన ఆహారం తింటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణ శక్తిని కూడా పెంచే పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఒత్తిడి తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అయితే రాత్రి సమయంలో పులిసిన ఆహారం తింటే ఏమి అవుతుందో చూద్దాం. పులిసిన ఆహారాలను మధ్యాహ్న సమయంలో మాత్రమే తీసుకోవాలి. రాత్రి సమయంలో తీసుకోవటం వలన కడుపులో వేడి పెరిగి నిద్ర మీద ప్రభావం చూపుతుంది.
కొంత మందిలో కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని సమస్యలతో బాధపడుతున్నవారు పులిసిన ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది. ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారు,రక్తపోటు సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. ఎందుకంటే పులిసిన ఆహారాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. పులిసిన ఆహారాలు తిన్నప్పుడు కడుపులో ఏమైనా అసౌకర్యం అనిపిస్తే తినటం వెంటనే మానేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

