Healthhealth tips in telugu

Raw Vegetables:ఆరోగ్యం కోసం పచ్చివి తింటున్నారా.. అయితే వీటిని మాత్రం అస్సలు తినకండి..తింటే ఇబ్బందే…!

Raw Vegetables: ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి పచ్చి కూరగాయలను తింటున్నారు. అయితే కొన్ని కూరగాయలను పచ్చిగా తింటే కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకూర, క్యాబేజీ వంటి వాటిని పచ్చిగా సలాడ్ కోసం ఉపయోగిస్తారు. కొన్ని కూరగాయలను అసలు పచ్చిగా తినకూడదు. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

బంగాళదుంపను అసలు పచ్చిగా తినకూడదు. పూర్తిగా ఉడికిన బంగాళదుంపను మాత్రమే తినాలి. ఒకవేళ పచ్చిగా లేదా సగం ఉడికిన బంగాళదుంప తింటే గ్యాస్-గుండెల్లో మంట, అపానవాయువు,కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ, మొలకలు వంటి పచ్చి కూరగాయలను పచ్చిగా తింటే గ్యాస్,థైరాయిడ్ సమస్యలు వస్తాయి.

పుట్ట గొడుగులను శుభ్రంగా కడిగి బాగా ఉడికించి తినాలి. ఒకవేళ పచ్చిగా తింటే శరీరానికి హాని కలుగుతుంది. పచ్చిగా లేదా సగం ఉడికిన వంకాయను అసలు తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణక్రియ సమస్యలు, వాంతులు, కడుపునొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.

బీన్స్ ని తప్పనిసరిగా ఉడికించి మాత్రమే తినాలి. బీన్స్‌లో అమైనో ఆమ్లాలు ఉంటాయి. పచ్చి బీన్స్ తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ స్థాయి పెరుగుతుంది.కాబట్టి ఈ విషయాన్నీ గుర్తుంచుకోవాలి.

ఈ మధ్య కాలంలో రాజ్మా వాడకం కూడా బాగా పెరిగింది. రాజ్మా పచ్చిగా లేదా నానబెట్టి కూడా తినకూడదు. బాగా ఉడికించి మాత్రమే తినాలి. రాజ్మా వండడానికి ముందు సుమారు 10-12 గంటల పాటు నీటిలో నానబెట్టి ఉడికించి తినాలి. ఒక్క రాజ్మా గింజ కూడా పచ్చిగా తిన్నా కూడా జీర్ణం కాకుండా అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News