Beauty Tips

White Hair:ఈ ఆకులతో చేసిన నూనె తలకు పట్టిస్తే జీవితంలో తెల్లజుట్టు అనేదే ఉండదు

White Hair turn black Home Remedies:మారిన పరిస్థితి కారణంగా ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా తెల్లజుట్టు సమస్య,జుట్టు రాలిపోవటం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. తెల్లజుట్టు సమస్య, జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇపుడు చెప్పే నూనెను వాడితే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

అలాగే తెల్లజుట్టు సమస్య కూడా తగ్గుతుంది. ఒక్కసారి ఈ నూనెను తయారుచేసుకుంటే నెల రోజుల పాటు వాడవచ్చు. 250 గ్రాముల కొబ్బరి నూనెలో 10 మందార ఆకులు లేదా 5 మందార పువ్వులు ,గుప్పెడు వేప ఆకులు, 5 ఆముదం ఆకులు,గుప్పెడు తంగేడు ఆకులు,అరకప్పు కలబంద గుజ్జు, గుప్పెడు గుంటగలగరాకు, అరకప్పు ఎండిన ఉసిరి ముక్కలు,గుప్పెడు గోరింటాకు, రెండు స్పూన్ల మెంతులు , వట్టివేర్లు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి 15 నిమిషాల పాటు మరిగించాలి.

మరిగిన ఈ నూనెను వడకట్టి ప్రతి రోజు జుట్టుకు రాస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్నవారు ఈ నూనెను వాడితే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. సహజసిద్దమైన వస్తువులతో తయారుచేసుకోవటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

ఈ నూనెను ఒక్కసారి తయారుచేస్తే నెల రోజుల వరకు వాడుకోవచ్చు. మార్కెట్ లో దొరికే నూనెలు కన్నా సహజసిద్దంగా చేసుకున్న నూనెలను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెను కాస్త ఓపికగా చేసుకోవాలి. ఈ నూనెలో వాడిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News