నోరూరించే ఫ్రూట్ రవ్వ కేసరి: ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Fruit Rava Kesari Recipe: ఈజీగా,త్వరగా చేసుకునే స్వీట్ ఏదైనా ఉంది అంటే అదీ రవ్వ కేసరినే. ఇంట్లో ఉండే ఐటమ్స్ తో అరగంటలో అద్భుతమైనా ఫ్రూట్ రవ్వ కేసరి చేసేయండి.
పండుగ వచ్చినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చే స్వీట్ రవ్వ కేసరి. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త వెరైటీగా, పండ్లతో ‘ఫ్రూట్ రవ్వ కేసరి’ ఎప్పుడైనా ట్రై చేశారా? రకరకాల పండ్ల ముక్కలు వేసి చేసే ఈ కేసరి రుచి అద్భుతంగా ఉంటుంది.

ఒక్కసారి ఈ మిక్స్డ్ ఫ్రూట్ రవ్వ కేసరి రుచి చూశారంటే ఇక మామూలు కేసరిని అస్సలు ఇష్టపడరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే ఈ స్వీట్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
కావాల్సిన పధార్ధాలు
రవ్వ- ½ కప్పు
శెనగపిండి- ½ కప్పు
పంచదార- 1 కప్పు
పాలు- ¼ కప్పు
నీళ్లు – 1 కప్పు
యాలకులు – 3
టూటీ ఫ్రూటీ- 2 టేబుల్ స్పూన్స్
బాదాం- 10
జీడిపప్పులు- 15
పిస్తా – 7-8
నెయ్యి – ½ కప్పు
ఫైనాపిల్ ఎసెన్స్ – 4-5 చుక్కలు
ఎల్లో ఫుడ్ కలర్ – 1 టీ స్పూన్
తయారి విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి కరిగించి అందులోకి జీడిపప్పు,బాదం,పిస్తా వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి.
2.మిగిలిన నెయ్యిలో దంచిన యాలకులు,రవ్వ,శెనగపిండి వేసి బాగా కలుపుతూ వేపుకోవాలి.
3.వేగిన రవ్వలో నీళ్లు,పాలు పోసి దగ్గర పడనివ్వాలి.
4.దగ్గర పడుతున్న రవ్వలో ఎసెన్స్ పంచాదార ఎల్లో ఫుడ్ కలర్ వేసి పంచదార కరగనివ్వాలి.
5.పంచదార కరిగాక టూటి ఫ్రూటీ ,డ్రై ఫ్రూట్స్,నెయ్యి వేసికలిపుకోవాలి.
6.అంతే టేస్టీ టేస్టీ ఫ్రూట్ రవ్వ కేసరి రెడీ.

