Beauty Tips

Winter Beauty Tips: అందం కోసం ఏవేవో వాడకండి.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి!!

Black Sesame seeds face glow:మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా ఉండదు. అలాగే ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతుంది.

దీని కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా పెద్దగా పలితం రాక నిరాశ పడతారు. ఒక వేల పలితం వచ్చినా తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.

ఈ సమస్యకు ఇంటిలోనే మంచి పరిష్కారం ఉంది. వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఒక స్పూన్ నల్ల నువ్వులను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ నువ్వుల పొడి,పావు స్పూన్ పసుపు వేసి కొంచెం నీటిని పోసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని మంగు మచ్చలు,నలుపు,తెలుపు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నల్ల నువ్వులలో ఉండే లక్షణాలు మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు మచ్చలను తొలగించి చర్మం ఆరోగ్యంగా అందంగా తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఈ మచ్చలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.