Onion Chutney:ఉల్లిపాయ తో ఇలా పచ్చడి చేయండి.. ఇడ్లీ, దోశ,అన్నంలోకి.. 15 రోజులు నిల్వ ఉంటుంది
Onion Chutney:ఉల్లిపాయ చట్నీ.. తక్కువ పదార్ధాలతో ఎంత టేస్టీగా తయారు చేసుకునే చట్నీ ఉల్లిపాయ చట్నీ. ఇడ్లీ,దోశ,ఉప్మా వంటి టిఫిన్స్ లోకి ఈ చట్నీ రెడీ చేసుకున్నారంటే కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాయలు – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
మెంతులు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 7-8
తాలింపు కోసం..
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – టీ స్పూన్
ఎండుమిర్చి – 2-3
పసుపు – ½ టీ స్పూన్
వెల్లుల్లి పేస్ట్ – 7-8
చింతపండు – 15 గ్రాములు
తయారీ విధానం
1.ముందుగా ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర,మెంతులు ,ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
3.వేగాక వేరోక ప్టేల్ లోకి తీసుకోవాలి.
4.ఇప్పుడు తాలింపు కోసం అదే బాండీ లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి ,పసుపు ,ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
5.ముందుగా వేపి పక్కన పెట్టుకున్న జీలకర్ర ,మెంతులను మిక్సి జార్ లో వేసి పొడి చేసుకోవాలి.
6.అందులోకి వెల్లుల్లి రెబ్బలు,నానబెట్టిన చింతపండు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
7.గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మగ్గుతున్న ఉల్లిపాయల్లో వేసి కొద్దిగా నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి.
8.నూనె పైకి తేలే వరకు ఉడికించుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉల్లిపాయ చట్నీ రెడీ.
9.ఈ పచ్చడి పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది.


